తెలంగాణ రాష్ట్రంలోనిఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించారు. ప్రత్యర్థి పార్టీలు ఆమెకు కనీసం పోటీకూడా ఇవ్వలేకపోయాయి. మొత్తం 824 ఓట్లలో 823 ఓట్లు పోలయ్యాయి.
ఇందులో కవితకు 728 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 ఓట్లు వచ్చాయి. మొత్తం పది ఓట్లు చెల్లబాటు కాలేదు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
మొదటి రౌండ్‌లో 600 ఓట్లకుగాను టీఆర్ఎస్‌కు 542 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్‌లో 221 ఓట్లకుగాను టీఆర్ఎస్‌కు 197, 17 బీజేపీకి, 7 కాంగ్రెస్‌పార్టీకి వచ్చాయి.