తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో విద్యుత్ జిగేల్మంటున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయించారు.
ఈ ఆరేండ్లలో సుమారు రూ.104.09 కోట్ల విద్యుత్ పనులు చేపట్టారు. నియోజకవర్గంలోని అప్పనపల్లి, రామసముద్రం, రామక్కపేట, తిమ్మాపూర్, బొప్పాపూర్, కాసులాబాద్, జప్తిలింగారెడ్డిపల్లి, గొడుగుపల్లి, మాచిన్పల్లి, అనాజీపూర్, కాసన్‌పల్లి, అనంతసాగర్ గ్రామాల్లో 33/11 కేవీ సబ్స్టేషన్లను 14 కొత్త వినియోగంలోకి తీసుకురాగా, ధర్మారం, పెద్దమాసాన్‌పల్లి, చిత్తోజ్పల్లి, పోతారం గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి.
కాగా దౌల్తాబాద్‌లో 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను రూ. 8.70 కోట్లతో ఏర్పాటుచేశారు. లోవోల్జేజీ నివారణకు 23 అదనపు ట్రాన్స్ఫార్మర్లు, 16 పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు.