తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలుకు మార్కెటింగ్‌శాఖ చర్యలు ముమ్మరంచేసింది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా 300 కేంద్రాల ఏర్పాటుచేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే పత్తి కొనుగోలుకు సీసీఐ సమ్మతించిన విషయం తెలిసిందే.
ఇందుకు అనుగుణంగా పత్తి కొనుగోళ్లకు జిన్నింగ్ మిల్లులను ఎంపికచేసిన సీసీఐ ఆ జాబితాను రాష్ట్ర మార్కెటింగ్‌శాఖకు పంపించింది. ఎంపికచేసిన జిన్నింగ్ మిల్లులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? లేవా? అని మార్కెటింగ్‌శాఖ పరిశీలిస్తున్నది.
మరోవైపు పత్తి పంటచేతికి రావడం ప్రారంభమైంది. త్వరగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయనున్నది. గతేడాదితో పోల్చితే ఈసారి 20 నుంచి 30 కేంద్రాలు అదనంగా వచ్చే అవకాశం ఉన్నదని మార్కెటింగ్‌శాఖ అధికారు లు తెలిపారు. గతంతో పోల్చితే ఈసారి భారీగా పత్తి సాగైంది. గతేడాది 54.45 లక్షల ఎకరాల్లో పంట వేయగా, ఈ ఏడాది 60.22 లక్షల ఎకరాల్లో వేశారు