Home / SLIDER / వరంగల్ తూర్పులో కాంగ్రెస్ కు భారీ షాక్..

వరంగల్ తూర్పులో కాంగ్రెస్ కు భారీ షాక్..

టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలో,ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు నియోజకవర్గంలో చేపడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలకు ఆకర్శితులై వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ యూత్ అద్యక్షుడు మిట్ట నిషాంత్ గౌడ్,ఎన్.ఎస్ యూ.ఐ నియోజకవర్గ ఇంచార్జ్ కపిల రాజేశ్ సుమారు 400 మందితో కలిసి టీ.ఆర్.ఎస్ పార్టీలో చేరారు..ఈ మేరకు వారికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..

ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అభివృద్దిలో దేశంలోనే నంబర్ 1 గా నిలిపారన్నారు..టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే.టీ.ఆర్ గారు పట్టణాభివృద్దితో పాటు, పార్టీ కార్యనిర్వాహక అద్యక్షులుగా పార్టీ లోని ప్రతీ కార్యకర్తల బాగోగులు చూసుకుంటున్నారన్నారు.ఈ రోజు పార్టీలో చేరిన నిషాంత్,రాజేష్ లకు మంచి రాజకీయ భవిష్యత్ ను అందిస్తామని,వారితో పాటు చేరిన వారికి కూడా అండగా నిలుస్తామన్నారు. పేద ప్రజలకు సేవ చేయడమే నా ప్రదాన ఎజెండా అన్నారు..రాష్ట్రం లో కాంగ్రేస్ పని ఖతం అయ్యిందని,మరో ఇరవై ఏండ్లూ టీఆర్ఎస్ పార్టీదే అదికారమన్నారు..నియోజకవర్గ సమగ్రాభివృద్ది చేస్తానని,పార్టీని నమ్ముకుని ఉన్న వారికి,కొత్తగా పార్టీలో చేరిన వారికి మంచి రాజకీయ భవిష్యత్ అందించడంతో పాటు వారికి అన్నివేళలా అండగా ఉంటానన్నారు..

టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో నిశాంత్,రాజేశ్ 23వ డివిజన్ కాంగ్రేస్ అద్యక్షుడు విశ్వ,తూర్పు యూత్ కాంగ్రేస్ ప్రదాన కార్యదర్శి రఘు,బండి సాయి,ఎస్టీ సెల్ బూక్య రవి,20 వ డివిజన్ ఎస్టీ సెల్ నరేశ్,23 వ డివిజన్ మహిళా అద్యక్షురాలు మిట్ట ప్రియాంక,యువజన విబాగం నాయకులు అఖిల్ సాయి,రాహుల్,అంజద్,సత్యనాయక్,నెహ్రు, రాము,వసంత,బూక్యకౌసల్య రాజు తదితరులు ఉన్నారు..

ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు కత్తెరశాల వేణు గోపాల్,మేడిద రజిత మదుసూదన్,రిజ్వానా షమీమ్ మసూద్,కుడా డైరెక్టర్ మోడెం ప్రవీణ్,చాంబర్ ఆఫ్ కామర్స్అద్యక్షులు దిడ్డి కుమారస్వామి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టీ.రమేష్ బాబు,మాజీ కార్పోరేటర్ బాసాని శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు ముస్కమల్ల సుదాకర్, 20 వ డివిజన్ ఇంచార్జ్ సిద్దంరాజు,బొరిగం నర్సంగం,గోరంటాల మనోహర్,గోరంటాల మనోహర్,కార్మిక విబాగం జిల్లా అద్యక్షుడుబోగి సురేశ్,అచ్చ వినోద్,బత్తుల కుమార్,ఎలగందుల సుదాకర్,బొల్లం రాజు తదితరులు పాల్గొన్నారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat