ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం 5 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నారు. గడచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో కొత్తగా 5,653 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఈ వైరస్ బారినపడిన వారిలో మరో 35 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,50,517 మంది కరోనా బారినపడగా 6,97,699 మంది కోలుకున్నారు. మరో 46,624 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.
ఇప్పటి వరకు కరోనా బారినపడి 6,194 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 73,625 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకు 64,94,099 మందికి టెస్టులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.