తెలంగాణలో కొత్తగా 1,717 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. గత 24 గంటలుగా కరోనాతో ఐదుగురు మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 2,12,063కి చేరింది.
ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1,222 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 25,713 యాక్టివ్ కేసులుండగా.. 1,85,128 మంది కరోనాను నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.
ఇప్పటివరకూ తెలంగాణలో 35.47 లక్షల కరోనా టెస్టుల నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా జీహెచ్ఎంసీ 276 కరోనా కేసులు నమోదయ్యాయి.