సినీ నటుడు జగపతిబాబు సోదరుడిని బెదిరిస్తున్నాడో వ్యక్తి.. ఫిలింనగర్‌లో నివసించే జగపతిబాబు సోదరుడు యుగేంధ్ర కుమార్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి.. . గుట్టల బేగంపేట స్థల విషయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి దాదాపు 25 ఫోన్ కాల్స్ వచ్చినట్టుగా చెబుతున్నారు..
యుగేంధ్ర కుమార్‌తోపాటు అతని కుమారుడిని కూడా చంపేస్తామని బెదిరించాడు శ్రీనివాస్. అయితే, ఈ బెదిరింపు కాల్స్ వెనుక.. వెనుక బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన రాజిరెడ్డి అనే వ్యక్తి ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు యుగేంధ్ర కుమార్…
ఈ విషయంపై బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించిన ఆయన.. బెదిరింపు కాల్స్‌పై ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.