ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5 గంటలకు రాష్ర్ట మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన చట్టసవరణ బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది. యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానం అమలు, ధాన్యం కొనుగోలుపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
