దుబ్బాక ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీకి ఓటుతోనే సమాధానం చెప్పాలని మెదక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఓటర్లకు సూచించారు. చిన్న ఆరెపల్లిలో ఇవాళ ఉదయం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
సోలిపేట సుజాతకు ప్రతి ఒక్కరూ ఓటేసి.. భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో కష్టాలు పడ్డ తెలంగాణ ఇప్పుడిప్పుడే గట్టెక్కుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం కృషి చేస్తుంటే.. బీజేపీ మాత్రం రైతుల పొట్ట కొడుతుందని ధ్వజమెత్తారు.
బావుల కాడ మీటర్లు పెట్టే బీజేపీకి ఓటేసే ముందు ఆలోచించాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని పద్మా దేవేందర్ రెడ్డి సూచించారు.