దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు తగ్గుతు పెరుగుతు వస్తున్నాయి. నిన్న 78 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య కొద్దిగా తగ్గింది. నేడు 70 వేల కేసులు నమోదవడంతో దేశంలో కరోనా కేసులు 69 లక్షల మార్కును దాటాయి.
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 70,496 మంది కరోనా బారినపడ్డారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 69,06,152కు చేరింది. ఇందులో 8,93,592 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
మరో 59,06,070 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కరోనా వల్ల 964 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో 1,06,490 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.