తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో కరోనా పాజిటీవ్ కేసుల నమోదు సంఖ్య కాస్త తగ్గినట్లు అన్పిస్తుంది. గత ఇరవై నాలుగంటల్లో మొత్తం 1,891కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.ఇందులో ఏడుగురు మృతి చెందినట్లు కూడా ప్రకటించింది.
ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,08,535కి చేరింది..ఇప్పటివరకు 1,208 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 26,374 యాక్టివ్ కేసులు ఉన్నాయి..
చికిత్స నుంచి కోలుకుని 1,80,953 మంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే మరోవైపు కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 285, మేడ్చల్‌లో 195 కరోనా కేసులు నమోదు