ముఖ్యమంత్రి కెసిఆర్ గారు రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు,కార్యక్రమాల పట్ల ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకు పోతున్నాయని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టి అన్ని తెలంగాణను అన్ని రంగాలలో ప్రగతిపథాన నడిపిస్తున్న కెసిఆర్ గారు మహోన్నత నాయకులు అని ఆయన కొనియాడారు.పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన పలు గ్రామాలలోని కాంగ్రెస్ ,బిజెపిల నాయకులు ఈశ్వర్ గారి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా ధర్మారంలోని ఎర్రగుంటపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, టిఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అన్నారు.కాంగ్రెస్,బిజెపిలు ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాయని, కెసిఆర్ గారి సుపరిపాలనకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నదని వివరించారు.కాంగ్రెస్, బిజెపిల నుంచి వచ్చిన నాయకులు,కార్యకర్తలకు మంత్రి గులాబీ కండువాలు కప్పి టిఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా గులాబీ తీర్ధం తీసుకున్న వారిలో అత్యధికులు మహిళలు,యువత ఉన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్టా మధుకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రఘువీర్ సింగ్, ధర్మారం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు ముత్యాల కరుణశ్రీ, ఉపాధ్యక్షులు ఎం.తిరుపతి, జెడ్పీటీసీ పి.పద్మజ, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల చైర్మన్లు ఎం.బలరాంరెడ్డి,ఎన్.వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు రాజయ్య,కె.బుచ్చిరెడ్డి,పి.రామారావు, మహ్మద్ సలావుద్దీన్, మహ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.