దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారి ఎనలేని సుదీర్ఘ ప్రజా సేవలకు టి ఆర్ ఎస్ పార్టీ గౌరవాన్ని ఇస్తూ.. వారి సతీమణి సోలిపెట సుజాత కు సీఎం కేసీఆర్ గారు దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని మంత్రి హరీష్ రావు గారు అన్నారు.. ఈ సందర్భంగా చిట్టాపూర్ గ్రామంలో సుజాత స్వగృహంకి వెళ్లి రామలింగారెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఆమెకు అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన విషయాన్ని తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రచారం కి తీసుకెళ్లడానికి వచ్చాను అని చెప్పారు..
2004లో శాసనసభ్యుడు గా ఎన్నికైన తర్వాత రామలింగారెడ్డి గారు అనేక ఉద్యమాలు చేశారని. తెలంగాణ ఉద్యమంలో కృయాశీల పాత్ర పోషించారు. ఉద్యమం కోసం, పార్టీ కోసం అంకిత భావంతో పని చేశారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి చివరి శ్వాస వరకు ఎంతో కష్టపడి పని చేశారని రామలింగారెడ్డి కుటుంబం అటు ఉద్యమంలోనూ ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ పాల్పంచుకున్నారు… నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలతో ఆ కుటుంబానికి అనుబంధం ఉందన్నారు..4 మార్లు ఎమ్మెల్యే గా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం దుబ్బాక ప్రాంతానికి ఎనలేని సేవ చేశారు అని.. రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగించాలని వారి కుటుంబానికి టిక్కెట్ ఇచ్చినందుకు కెసిఆర్ కు ధన్యవాదములు.
రామలింగారెడ్డి గారిని ఏ విధంగా అవుతే ఆశీర్వదించారో సోలిపేట సుజాత గారిని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.. రామలింగారెడ్డి గారు తలపెట్టిన నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగిస్తామని ఈ సందర్భంగా చెప్పారు.. తెలంగాణ లో ఉన్న సంక్షేమ పథకాలు దేశానికి రోల్ మోడల్ గా నిలిచాయని.. అదే స్ఫూర్తితో దుబ్బాక నియోజక వర్గాన్ని రామలింగారెడ్డి అభివృద్ధి చేశారని చెప్పారు..
ఇప్పుడు రామలింగారెడ్డి ని స్ఫూర్తి గా తీసుకుని ఆయన సతీమణి పనిచేసి పూర్తి చేస్తది.. పేదల కోసం ఎంతగానో కృషి చేసిన వ్యక్తి రామలింగారెడ్డి.. దుబ్బాక దశ దిశ మార్చిన గొప్ప వ్యక్తి.. రామలింగారెడ్డి భార్య అంటే మాకు చెల్లె లాంటిది.. మేమిద్దరం కుడి ఎడమ భుజం వలే పనిచేస్తమని.. ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఈరోజు రామలింగారెడ్డి సతీమణి ని కలిసి.. మాతో పాటు ప్రచారానికి తిరిగేందుకు తీసుకెల్లడానికి వారి ఇంటికి వచ్చామనిఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు తదితరులు ఉన్నారు..