ఎల్బీనగర్ జోన్ పరిధిలోని ఎఫ్ సిఐ కాలనీ ఫేస్ 2 నందు ఏపుగా పెరిగిన చెట్లను నరికి వేస్తున్న విషయాన్ని ఆ కాలనీవాసురాలు అయిన సురభి మేట్ పల్లి మొదటగా అధికారులకు కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది.
అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తు అందరిచేత మన్ననలు పొందుతు స్వతహాగా పకృతి ప్రేమికుడైన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకపోతే తప్పకుండా ఫలితం ఉంటుంది అన్న నమ్మకం తో ట్విట్టర్ వేదికగా చెట్లను నరికి వేస్తున్న వీడియోను రాజ్యసభ సభ్యులు సంతోష్ గారి దృష్టికి తీసుకు పోవడం జరిగింది.
ఏదైతే నమ్మకంతో ఆమె ట్విట్టర్ చేశారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తక్షణమే స్పందించిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు ట్విట్టర్ లో ఈ విషయాన్ని జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ గారి దృష్టికి తీసుకుపోయి తక్షణమే చెట్ల నరికివేత ను ఆపుచేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
రాజ్యసభ సభ్యులు సంతోష్ గారి ట్విట్టర్ పోస్టింగ్ ని పురస్కరించుకొని జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ గారు ఎల్బినగర్ జోనల్ కమిషనర్ గారిని ఆదేశించగా , ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి గారు చెట్లు నరికి వేస్తున్న ప్రదేశానికి వెళ్లి , చెట్లను నరికివేతను ఆపించి దానికి బాధ్యులైన రమేష్ బాబు గారికి 25 వేల రూపాయల జరిమానా విధించి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఎవరు చేసినా కఠిన చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది.