తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కరోనా నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అద్భుతంగా పని చేస్తోందన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలు కలిసి పనిచేయడం వల్లే… ఈ సారి సీజనల్ వ్యాధులు కూడా బాగా తగ్గాయన్నారు. రోగాలు, వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణలో కొత్తగా 1,869 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసులు 2,06,644కి చేరుకున్నాయి.
1,201 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 26,368 యాక్టివ్ కేసులున్నాయి. 79,075 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో 294, రంగారెడ్డి 211, మేడ్చల్ 154 కరోనా కేసులున్నాయి.