తెలంగాణ రాష్ట్రములోని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ కొనియాడారు. మండలంలోని నాగునూర్, లచ్చక్కపేట గ్రామాల్లో మంగళవారం సీసీరోడ్లు, కుల సంఘ భవనాల నిర్మాణ పనులను ప్రారంభించారు.
లచ్చక్కపేటలో రూ.2.76 లక్షలతో చేపట్టే గౌడ సంఘ భవనం, రూ.2.76 లక్షలతో చేపట్టే మున్నూరుకాపు సంఘ భవనం, రూ.10 లక్షలతో మూడు సీసీరోడ్లు, నాగునూర్‌లో రూ.2.76 లక్షల చొప్పున రెండు ముదిరాజ్ సంఘ భవన నిర్మాణాలకు భూమిపూజలు చేసి పనులను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో చేపడుతున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, ప్రతినెలా జనాభా ఆధారంగా గ్రామాలకు నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొ న్నారు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. మళ్లీ నాలుగైదు రోజుల్లో నిజామాబాద్‌లో గెలిచి వస్తారని, మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని కోరారు.
ఎన్నికల సమయంలో పింఛన్‌లో కేంద్రం రూ.800 ఇస్తుందని ప్రచారం చేశారని, అసలు దేశంలోనే కేంద్రం రూ.800 ఇచ్చే రాష్ట్రం ఒక్కటి కూడా లేదని చెప్పారు. ప్రధాని సొంత ప్రాంతం గుజరాత్‌లో కూడా ఇవ్వడం లేదని తెలిపారు. పింఛన్ రూ.2 వేలలో కేంద్రం ఇచ్చేది కేవలం రూ.36 మాత్రమేనని చెప్పారు. అప్పుడు పసుపు రైతులన్నారు అది ఎటోపోయింది, ఇప్పుడు మక్కలు ఇతర దేశాల నుంచి తెచ్చుకోవచ్చంటున్నారని అన్నారు.
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందున్నారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రతి గ్రామంలోనూ డంప్ యార్డులు, వైకుంఠధామాలు నిర్మితమవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కార్యక్రమాల్లో వైస్ ఎంపీపీ సురేందర్, ప్రజాప్రతినిధులు కాసుగంటి వెంకటరమణారావు, దమ్మ గంగు, మలేపు విమల, బెక్కెం జమున, పల్లపు వెంకటేశ్, సింగిల్ విండో చైర్మన్లు గురునాథం మల్లారెడ్డి, ఏలేటి నర్సింహా రెడ్డి, నాయకులు అమీర్, దామోదర్‌రావు, తోడేటి శేఖర్ గౌడ్, శ్రీధర్, రాజన్న, సురేశ్, దూలూరి వంశీ, గంగారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.