తెలంగాణలో ఆడబిడ్డలకు పెళ్లి కానుకగా ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మల్యాల మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు మంగళవారం కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరోనా సంక్షోభ పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. ఎన్నికల కోసం కాకుండా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తు న్నామన్నారు. మేనిఫెస్టోలో లేని అంశమైన కల్యాణలక్ష్మి పథకాన్ని రూపొందించి అడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వ కానుకగా లక్షా నూట పదహారు రూపాయలను అందజేస్తున్నామని తెలిపారు.
మండలంలోని బల్వంతాపూర్, గొర్రెగుండం, మ ద్దుట్ల, మల్యాల, మానాల గ్రామాలకు చెందిన 66 మంది లబ్ధిదారులకు 65 లక్షల 82 వేల 656 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శైలజ, ఎంపీపీ విమల, జడ్పీటీపీ రామ్మోహన్‌రావు, మల్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు సుదర్శన్, మల్యాల, నూకపల్లి, పోతారం సహకార సంఘ అధ్యక్షులు రాంలింగారెడ్డి, బోయినిపల్లి మధుసూదన్‌రావు, అయిల్నేని సాగర్‌రావు, సర్పంచులు బద్దం తిరుపతిరెడ్డి, గొడుగు కుమారస్వామి, గడికొప్పుల రమేశ్, గొట్టె హన్మాండ్లు యాదవ్, సుంకె లచ్చయ్య, కెల్లేటి మల్లమ్మ, ఎంపీటీసీలు ముదుగంటి అనిత, రాచర్ల రమేశ్, సంగాని రవి, పోతాని రవి, మండల కోఆప్షన్ సభ్యుడు అజహర్, నాయకులు ముత్యాల నరసింహారెడ్డి, జున్ను సురేందర్, మిట్టపల్లి రమణ, ఎడిపల్లి అశోక్, ఆగంతం వంశీదర్ తదితరులు పాల్గొన్నారు.