కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని బాల్ రెడ్డి నగర్ లో రూ.7.30 లక్షలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక డివిజన్ అధ్యక్షులు కెఎం గౌరీష్ గారితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ ఏర్పాటుతో స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, శుభకార్యాలకు, పండగలకు కమ్యూనిటీ హాల్ తోడ్పడుతుందన్నారు.
నియోజకవర్గంలోని ప్రతి కాలని, ప్రతి బస్తీలో మెరుగైన సేవలందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో పురపాలక మంత్రి కేటీఆర్ గారి మార్గ నిర్దేశకత్వంలో కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సంపత్ మాధవ రెడ్డి, కిషోర్ చారి, వార్డు సభ్యులు సత్తి రెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్, రామారావు లక్ష్మణ్, లోహిత్ రెడ్డి, రవిందర్ రెడ్డి, అరుణ, మనోహర మరియు కాలని వాసులు పాల్గొన్నారు.