Home / SLIDER / పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..

పేద ప్రజలకు వరం ముఖ్యమంత్రి సహాయనిది అని వరంగల్ తూర్పు నియోజకవర్గ  ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..ఈ రోజు శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి సంబందించిన 53మంది లబ్దిదారులకు చెందిన 20,50000/- రూపాయల విలువ చేసే 53 చెక్కులను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ లబ్దిదారులకు అందజేసారు..

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదలకు మేలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వం అన్నారు..పేదల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సంక్షేమాభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు..ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా పేదలకు వారు అండగా నిలుస్తున్నారన్నారు..

నియోజకవర్గంలో 20లక్షల50వేల రూపాయల విలువ చేసే 53చెక్కులను ఈ రోజు లబ్దిదారులకు అందజేసామని,పేదలకు సేవ చేయడమే ప్రదాన ఎజెండాగా పనిచేస్తానని నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్దిలో ముందుచుతానన్నారు..
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat