తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1,335 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి చెందారు.
అయితే ఇప్పటి వరకూ మొత్తంగా 2,00,611కి కరోనా కేసులు చేరుకున్నాయి. మరణాల సంఖ్య మొత్తంగా 1,171కి చేరుకుంది.తాజాగా తెలంగాణలో 27,052 యాక్టివ్ కేసులున్నాయి.
ఇప్పటి వరకూ మొత్తంగా 1,72,388 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 32.41 లక్షల కరోనా టెస్టులను నిర్వహించారు. అయితే గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 262, రంగారెడ్డి 137, మేడ్చల్ 91 కరోనా కేసులు నమోదయ్యాయి.