తెలుగు చిత్రసీమలో క్రమంగా షూటింగ్‌ల సందడి మొదలవుతోంది. లాక్‌డౌన్‌కు మందు ఆగిపోయిన అగ్రతారల చిత్రాలు కూడా పునఃప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నుంచి తాను షూటింగ్లో పాల్గొనబోతున్నానని చెప్పింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న.
ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. కెరీర్ ఆరంభం నుంచి అభిమానులు తనపై అంతులేని ప్రేమను చూపిస్తున్నారని..వారి ఆత్మీయతకు వెలకట్టలేనని ఆనందం వ్యక్తం చేసింది. తన అభిమానగణానికి ‘రోషియన్స్’ అని పేరు పెడుతున్నట్లు రష్మిక మందన్న తెలిపింది. ‘లాక్‌డైన్ టైమ్‌లో కొంతకాలం ఒంటరిగా ఉన్నా.
ఆ తర్వాత ఫ్యామిలితో విలువైన సమయాన్ని గడిపాను. అయితే సోషల్‌మీడియా ద్వారా అభిమానులు మాత్రం నాతో ఎప్పుడూ టచ్‌లో ఉన్నారు. వారితో చేసిన లైవ్‌షోలు, పంచుకున్న విశేషాలు గొప్పగా అనిపించాయి.
అభిమానుల ప్రేమే నా బలంగా నిలిచింది’ అని రష్మిక మందన్న పేర్కొంది. ప్రస్తుతం ఈ సొగసరి అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లోనే రష్మిక మందన్న పాల్గొనబోతున్నదని సమాచారం.