Home / SLIDER / తెలంగాణ నీటి వాటాలను వెంటనే తేల్చాలి

తెలంగాణ నీటి వాటాలను వెంటనే తేల్చాలి

ఆది నుంచీ తెలంగాణపై కేంద్రానిది ఇదే సవతి తల్లి ప్రేమ. దీన్ని ఎండగడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెఖావత్‌కు ఘాటుగా లేఖ రాశారు. తెలంగాణ వాదనను, వేదనను ఇకనైనా పట్టించుకోవాలని అందులో హితవు చెప్పారు. బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని తెలంగాణ విద్యావంతులకు, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో సమగ్రంగా అందులో వివరించారు. నదీ జలాల్లో వాటా- కేటాయింపుల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి.. గత కొద్ది రోజులుగా మేధోమథనం జరిపారు. అపెక్స్‌ కమిటీ సమావేశం నేపథ్యంలో జల వనరుల నిపుణులు, ఉన్నతాధికారులతో 48 గంటల సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. మోదీ సర్కారు వైఖరి కారణంగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సంపూర్ణంగా, సమగ్రంగా ఆవిష్కరిస్తూ 14 పేజీల లేఖను రూపొందించారు. సాధారణంగా దేశంలో ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు, 1956 రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం దానికి కొన్ని హక్కులు సంక్రమిస్తాయి. దీని ప్రకారం… భూమి, నీళ్లు, ఇతర అంశాల్లో కొత్త రాష్ట్రం వాటా ఏమిటో తేల్చి కేటాయించాల్సిన బాధ్యత కేంద్రానిది. 2014 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, 40 రోజులైనా తిరక్కుండానే కేసీఆర్‌ కేంద్రానికి ఈ సంగతి గుర్తు చేశారు. కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేల్చేందుకు ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలనీ, లేదా ఉన్న ట్రైబ్యునల్‌కైనా ఆ బాధ్యత అప్పగించాలనీ విన్నవించారు. కానీ కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేదు. ఆరేండ్లు గడిచిపోయాయి. కేంద్రం ఇప్పటికీ ఆ విషయం గురించి మాట్లాడడం లేదు. కేంద్రం చూపిన ఈ ఘోరమైన నిర్లక్ష్య వైఖరి వల్ల, సాచివేత వల్ల, ఇప్పుడు రెండు తెలుగు రాష్ర్టాలు మళ్లీ నీళ్ల కోసం కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. కేంద్రంలో అధికారంలోకి రాగానే, దాదాపు 2700 చదరపు కిలోమీటర్ల తెలంగాణ భూభాగాన్ని, ఏకంగా 7 మండలాలను, 400 మెగావాట్ల సీలేరు పవర్‌ప్లాంటును ఆంధ్రకు కట్టబెట్టడానికి ఎంతో ఆత్రపడ్డ మోదీ సర్కారు, తెలంగాణ నీళ్లెన్నో తేల్చమంటే మాత్రం నోరు తెరవడం లేదు. కేంద్రం నిర్లక్ష్యం వల్లే కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను తెలంగాణ ఇప్పటిదాకా పొందలేకపోయిందని, రెండు రాష్ట్రాల మధ్య జల పంపిణీని సుగమం చేసే బదులు.. కేంద్రం వైఖరి వివాదాలకు ఆజ్యం పోసిందని కేసీఆర్‌ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ వాటా తేల్చే బాధ్యతను వెన్వెంటనే, తక్షణమే ట్రిబ్యునల్‌కు నివేదించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ వాటాను ఇప్పటిదాకా తేల్చకపోవడం వెనక మతలబు ఏమిటో, ఈ నిష్క్రియా పరత్వానికి, నిర్లక్ష్య ధోరణికి, కారణమేమిటో, కారకులెవరో ఢిల్లీ పెద్దలు బయటపెట్టాలని సూచించారు. నదీ జలాల్లో వాటా తేల్చకుండా చేతగానితనంతో బీజేపీ సర్కారు తెలంగాణ పట్ల ఘోర అన్యాయానికి పాల్పడుతున్నదని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. అదే సమయంలో ఆంధ్రాపట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు.

మా ప్రాజెక్టులేవీ కొత్తవి కావు
గోదావరిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫిర్యాదు చేయడాన్ని కేసీఆర్‌ ఈ లేఖలో ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాలంలో బచావత్‌ ట్రిబ్యునల్‌ కృష్ణానదిలో నికర జలాలు తేల్చి రాష్ర్టాలకు వాటాలు వేసిందనీ, కానీ గోదావరి విషయంలో మాత్రం నికర జలాలు తేల్చలేదనీ ఆయన తెలియజెప్పారు. గోదావరిలో ఉపనదుల ఆధారంగా సబ్‌ గోదావరి- సబ్‌ బేసిన్‌ ప్రాతిపదికన అన్ని రాష్ర్టాలకూ అది నీళ్లు కేటాయించిందని వివరించారు. (గోదావరి ఉపనదులు ప్రధానంగా తెలంగాణలోనే ఉన్న సంగతి తెలిసిందే) గోదావరి జలాల్లో తెలంగాణ తనకు కేటాయించిన కేటాయించిన 967.94 టీఎంసీల నుంచే నీటిని వినియోగించుకుంటున్నదనీ, ఇప్పుడు కడుతున్నవన్నీ పాత ప్రాజెక్టులేనని కేసీఆర్‌ స్పష్టంచేశారు. గోదావరిపై చేపట్టిన ప్రాజెక్టులేవీ కొత్తవి కావని, అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో ప్రారంభించినవేనని ఆధారాలతో సహా కేసీఆర్‌ లేఖలో వివరించారు. 56 ఏళ్ల కేంద్ర జల సంఘం రికార్డును బట్టి చూస్తే, గోదావరిలో దాదాపు మూడు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయనీ, అందులో 65 శాతం వాటా వేసుకున్నా.. ఇంకా 1950 టీఎంసీల నీళ్లు వాడుకునే హక్కు తెలంగాణకు ఉందనీ ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. వాస్తవం ఇదైనప్పుడు, గోదావరిపై తాము కడుతున్నవి అక్రమ ప్రాజెక్టులనీ, తెలంగాణ ఎక్కువ నీళ్లు వాడుకుంటున్నదనీ ఎలా అంటారని ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం, తాను చేసే అక్రమాల నుంచి, పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం తప్ప మరోటి కాదని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఎత్తుగడలేవీ ఫలించవనీ, నీళ్ల విషయంలో రాజీ పడే సమస్యే లేదనీ తేల్చి చెప్పారు. బేసిన్లు, బేషజాలు లేకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నడుమ నదీ జలాల పంపిణీ సజావుగా జరగాలని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన కేసీఆర్‌, ఏపీ ప్రభుత్వం దీనికి తూట్లు పొడుస్తున్నా, పంటి బిగువున అదిమిపట్టి, తెలంగాణ వాదనను గట్టిగా వివరించారు. నదీ జలాల పంపిణీలో తెలంగాణకు ఇంకా జరగని న్యాయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏపీ చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టారు. పొలాల పారుతున్న నీళ్లను చూసి సంబుర పడుతున్న తెలంగాణ రైతన్నకు రక్షణగా తాను ఎవరితోనైనా పోరాడతానని సందేశమిచ్చారు.

ఆంధ్రావే అక్రమ ప్రాజెక్టులు
ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాలను, పెద్ద ఎత్తున, అక్రమంగా బేసిన్‌కు అవతల ఉన్న ప్రాంతాలకు తరలించుకుపోతుంటే కృష్ణా నదీ జలాల యాజమాన్యబోర్డు (కేఆర్‌ఎంబీ) ఏం చేస్తున్నదని ముఖ్యమంత్రి నిలదీశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు విస్తరించి, రోజుకు 3 టీఎంసీలు తరలించేందుకు ఉద్దేశించిన రాయలసీమ ఎత్తిపోతల అక్రమ పథకాన్ని ఎందుకు నిలువరించడం లేదని ఆయన ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణానీటి అక్రమ తరలింపును ఆపడానికి కేంద్రం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని, కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. తద్వారా శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు, హైదరాబాద్‌ తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు.

వాటిని ఆపరేం?
ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాలను, పెద్ద ఎత్తున, అక్రమంగా బేసిన్‌కు అవతల ఉన్న ప్రాంతాలకు తరలించుకుపోతుంటే కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఏం చేస్తున్నది? పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు విస్తరించి, రోజుకు 3 టీఎంసీలు తరలించేందుకు ఉద్దేశించిన రాయలసీమ ఎత్తిపోతల అక్రమ పథకాన్ని ఎందుకు నిలువరించడం లేదు.

– లేఖలో కేసీఆర్‌ సూటి ప్రశ్న

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat