నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలలో భారీ మెజారిటీయే లక్ష్యం…
జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో సమావేశాలు..నియోజకవర్గాల వారీగా నేతలకు భాద్యతలు.
మాజీ ఎంపీ కవిత అభ్యర్థిత్వానికి మద్దతుగా, టీఆర్ఎస్ వైపు నిలుస్తున్న కాంగ్రెస్, బీజేపీ ల స్థానిక ప్రజాప్రతినిధులు
పోలింగ్ నాటికి 90% ఓటర్లు టీఆర్ఎస్ వైపు ఉండే అవకాశం…
అక్టోబర్ 9 న జరగనున్న నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందేందుకు పకడ్బందీ వ్యూహం రచించింది టిఆర్ఎస్ పార్టీ. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా గెలిచేందుకు టిఆర్ఎస్ కు సంపూర్ణంగా బలం ఉంది. అయితే భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించాలని భావిస్తున్న టిఆర్ఎస్ పార్టీ,అందుకు తగ్గట్టే కార్యాచరణ రూపొందిస్తున్నాం . ఉప ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాలపై చర్చించడం జరిగింది.
ఆదివారం రోజు హైదరాబాదులో లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశము కావడం జరిగింది.సోమవారం జరిగిన సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎంపీలు రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు,జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ గారు, ఎమ్మెల్సీలు రాజేశ్వర్ రావు గారు,విజి గౌడ్ గారు,ఆకుల లలిత గారు,నిజామాబాద్ జెడ్పి చైర్మన్ విఠల్ రావు,మాజీ చైర్మన్ దఫెదర్ రాజు,జిల్లా పార్టీ ఇంచార్జ్ తుల ఉమ గార్లతో సమావేశం కావడం జరిగింది.