తెలంగాణలో కరోనా ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన మంత్రి. ఆసుపత్రిలో ఉన్న వివరాలు పేషంట్లు, బెడ్స్ వివరాలు, ఆక్సిజన్ ఫెసిలిటీ రోగులకు అందుతున్న సేవలపై మంత్రి సమీక్షించారు.
వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేసిన విధంగానే కరోనా కేసుల సంఖ్య తగ్గుతుందని వివరించిన అధికారులు.. అయినా పరీక్షల సంఖ్యను ఏమాత్రం కూడా తగ్గించవద్దని పాజిటివ్ వచ్చిన వారి కాంటాక్ట్ లను కూడా పరీక్షలు నిర్వహించడం ద్వారా పూర్తిస్థాయిలో కరోనా కట్టడి చేయాలని తెలిపిన మంత్రి.
కరోనా ఉద్ధృతి తగ్గిన కూడా ప్రజలు అప్రమత్తంగా నే ఉండాలని ఒకే చోట ఎక్కువ మంది గుమికూడ వద్దని మొదటి నుంచి చెప్తున్నట్లుగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, సబ్బు, శానిటైజర్ లతో చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి అని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వివిధ మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు ఎకడమిక్ ఇయర్ నష్ట పోకుండా ఉండేందుకు నాన్ కోవిడ్ సేవల ను వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో.. గాంధీ హాస్పిటల్ తో సహా అన్ని ఆసుపత్రుల్లో కరోనా తో పాటు ఇతర వైద్య సేవలను పునరుద్ధరించాలని మంత్రి ఈరోజు అధికారులను ఆదేశించారు.
కరోనా కు చంపగలిగే శక్తి లేదు కానీ.. అజాగ్రత్తగా ఉండి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు అని ప్రజలకు మంత్రి సూచించారు.