కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులకు ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ప్రవేశపెట్టారా?, ఇలాంటి పథకాలు అమలు చేస్తున్న ఏ ఒక్క రాష్ట్రం పేరైనా చెప్పాలని బీజేపీ నాయకులను ప్రశ్నించారు.
సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మాత్‌పల్లి, మంగోల్ గ్రా మాల్లో మంత్రి హరీశ్‌రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొగుట తాసిల్ కార్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవంతోపాటు రైతు వేదిక భవనానికి శంకుస్థాపన చేశా రు.
మార్కెట్ యార్డులో రైతులకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందజేశారు. దు బ్బాకలోని పలు వార్డుల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడు తూ.. రైతుల బోరుబావులకు మీటర్లు పెడితేనే రాష్ర్టానికి నిధులు ఇస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెబుతున్నదన్నారు. మీట ర్లు పెట్టం.. మీ డబ్బులు అవసరం లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారని మంత్రి వెల్లడించారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఏ మోహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. దుబ్బాక నియోజకవర్గంలో వివిధ కారణాలతో 544 మంది రైతులు చనిపోతే.. రైతుబీమా పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున అందించామన్నారు.