పాకిస్థాన్ వెటరన్ పేసర్ ఉమర్ గుల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్టు 36 ఏళ్ల గుల్ ప్రకటించాడు. రిటైర్మెంట్ అనంతరం కోచ్‌గా రెండో ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు.
త్వరలో జరగనున్న జాతీయ టీ20 కప్.. ఆటగాడిగా అతడికి ఆఖరిది. 2003లో జింబాబ్వేతో వన్డే మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ఉమర్.. అదే ఏడాది టెస్ట్ జ ట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. 2016లో ఇంగ్లండ్‌పై చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
ఉమర్ 47 టెస్టులాడి 163 వికెట్లు పడగొట్టాడు. అలాగే 130 వన్డేల్లో 179, 60 టీ20ల్లో 85 వికెట్లు తీశాడు. 2009లో టీ20 వరల్డ్‌కప్ నెగ్గిన పాకిస్థాన్ జట్టులో గుల్ కీలక సభ్యుడు. ఆటగాడిగా కొనసాగుతున్న ఉమర్‌కు పాకిస్థాన్ క్రికెట్ కమిటీలో స్థానం కల్పించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.