ముందు 16 మందితో మొదలైన బిగ్ బాస్ రియాలిటీ షో మంచి రసవత్తరంగా సాగుతుంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో నుండి ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ కాగా.. కుమార్ సాయి, అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి ప్రవేశించారు. తాజాగా మరో బ్యూటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌజ్‌లోకి గురువారం అడుగుపెట్టింది. ఈమె ముఖం కవర్ చేసుకొని ఇంట్లోకి అడుగుపెట్టడంతో ఆమె ఎవరనే దానిపై అంతటా ఆసక్తికర చర్చ జరుగుతుంది.
తాజా సమాచారం ప్రకారం తెలుగు, తమిళ, బెంగాలీ భాషల్లో నటించిన హాట్ హీరోయిన్ స్వాతి దీక్షిత్‌ను వైల్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి పంపినట్టు సమాచారం. ఈమె తెలుగులో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘జంప్ జిలానీ’ సినిమాలో కథానాయికగా నటించింది. ‘నామ్’, ‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్’, ‘సింబా’ సినిమాలు స్వాతికు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడేనని వస్తున్న వార్తలలో నిజమెంత ఉందనేది తెలుసుకోవాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.