బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణంపై దర్యాప్తు జరుగుతున్న తరుణంలో నటి షెర్లిన్ చోప్రా సంచలన విషయం వెల్లడించింది. ఐపీఎల్ మ్యాచ్‌ల తర్వాత జరిగే పార్టీల్లో డ్రగ్స్ ఉపయోగించేవారని తెలిపింది. ఓసారి ఈ దృశ్యాని తాను చూశానని పేర్కొంది.
ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. ‘గతం లో కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ తర్వాత జరిగిన పార్టీకి హాజరయ్యా. ప్రముఖ క్రికెటర్లు, వారి భార్యలు కూడా ఆ పార్టీకి వచ్చారు. బాగా డ్యాన్స్ చేసి అలిసిపోయిన నేను వాష్‌రూంకు వెళ్లా. మహిళల వాష్‌రూంలో క్రికెటర్ల భార్యలు కొకైన్ మత్తులో ఉండడం చూసి షాకయ్యా. వారు నన్ను చూసి నవ్వగా..నేను ప్రతిగా నవ్వా.
రాకూడని ప్రదేశానికి వచ్చానని నాకు అర్థమైంది. దాంతో బయటకు వచ్చేశా. పార్టీ జోరుగా సాగుతోంది. అలాంటి డ్రగ్స్ పార్టీలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి’ అని వివరించింది. ‘పురుషుల వాష్ రూంకు వెళ్లినా అవే దృశ్యాలు కనిపించేవి’ అని చెప్పింది.