ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 6.5 లక్షల మార్కుని దాటేశాయి. గురువారం కొత్తగా 7,855 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 6,54,385కి పెరిగింది.
ఉభయ గోదావరి జిల్లాల్లో మరోసారి వెయ్యికిపైగా కేసులు నమోదవగా.. ప్రకాశంలో 927 కేసులు బయటపడ్డాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 8,807 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
రాష్ట్రంలో మరో 52 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. చిత్తూరులో 8, అనంతపురంలో 6, గుంటూరులో 6, కృష్ణాలో 5, ప్రకాశంలో 5, విశాఖపట్నంలో 5, తూర్పుగోదావరిలో 4, కడపలో 3, కర్నూలులో 3, పశ్చిమగోదావరిలో 3, విజయనగరంలో 2, నెల్లూరు, శ్రీకాకుళంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,558కి చేరుకుంది.