తెలంగాణలో నియంత్రి త పంటల సాగులో భాగంగా పత్తి పంట లక్ష్యా న్ని చేరుకున్నది. బుధవారంవరకు రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 60.03 లక్షల ఎకరాల్లో సాగు పూర్తయ్యింది.
నియంత్రిత సాగులో భాగంగా పత్తి పంటను 60.16 లక్షల ఎకరాల్లో సాగుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకు అనుగుణంగానే పత్తి సాగుకావడం విశేషం. వరిసాగు 52 లక్షల ఎకరాలు దాటింది. మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1.33 కోట్ల ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నట్టు వ్యవసాయశాఖ తన నివేదికలో పేర్కొన్నది.