ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజ్గిరి ఏసీపీ నర్సింహారెడ్డి నివాసంలో ఇప్పటి వరకు రూ. 5 కోట్ల ఆస్తులు గుర్తించామని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌లోని మహేంద్రహిల్స్ నివాసంలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, కరీంనగర్‌తో పాటు అనంతపురంలో మొత్తం 25 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు రూ. 5 కోట్ల ఆస్తులు గుర్తించామని స్పష్టం చేశారు. బ్యాంకు లాకర్లు చూడాలన్నారు. హైదరాబాద్‌లోని 3 ఇండ్లు, 5 ఇంటి స్థలాలను గుర్తించామని పేర్కొన్నారు. నరసింహారెడ్డి బంధువులు, బినామీల ఇళ్లలోనూ సోదాల సమాచారం రావాల్సి ఉందన్నారు. ప్రజాప్రతినిధుల లింకులు ఇంకా బయటపడలేదు.. విచారిస్తున్నామని ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు.