వెన్నెలలా నవ్వే అమ్మాయి… ఎర్నని వన్నెలో మెరుస్తున్న గాజులను వయ్యారంగా చేతులకు వేసుకుంటుంటే! చూసే కళ్లలో ఆనందం ఉప్పెనై పొంగదా?…పొంగుతుందనే అంటోంది ‘ఉప్పెన’ చిత్ర బృందం… సోమవారం తమ కథానాయిక కృతిశెట్టికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది.
చిత్రంలో ఆమె కొత్త లుక్‌ను ఈ సందర్భంగా విడుదల చేశారు. వైష్ణవ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మార్చిలోనే పూర్తైయింది. లాక్‌డౌన్ కారణంగా విడుదల ఆగిపోయింది.
ఈ సినిమాను మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకుడు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే విడుదలైన ‘నీ కన్ను నీలి సముద్రం’ అంటూ సాగే పాట… 124 మిలియన్ల వ్యూస్ సాధించింది. త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్రబృందం తెలిపింది.