డీఎంకే ఒక ఆన్‌లైన్ పార్టీగా మారిందని రాష్ట్ర సమాచార ప్రసార శాఖ మంత్రి కడంబూర్ రాజు ఎద్దేవా చేశారు. తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలు వచ్చేలోపు డీఎంకే కూటమి ఖాళీ అవుతుందన్నారు.
ప్రస్తుతం స్వతంత్రంగా ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేని స్థాయికి ఆ పార్టీ మారిపోయిందన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ అన్ని కార్యక్రమాలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తుందన్నారు.
స్వతంత్రంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేని ఆ పార్టీ, దానిని నడిపించేందుకు ఓ కమిటీకి అప్పగించిందని ఆరోపించారు. కానీ, అన్నాడీఎంకే మాత్రం ఎల్లవేళలా ప్రజల పక్షాన ఉంటూ, స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.