తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదుకాగా 10 మంది మృతి చెందారు. వైరస్ బారినపడిన వారిలో 2,143 మంది చికిత్సకు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,74,774 మంది కరోనా బారినపడగా 1,44,073 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 29,649 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 22,620 మంది హోం ఐసోలేషనల్‌లో ఉన్నారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ కారణంగా 1052 మంది మృతి చెందారు.
గడిచిన 24 గంటల్లో 53,690 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 25,73,005 టెస్టులు చేసినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.60శాతంగా ఉండగా, రికవరీ రేటు 82.43 శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 309 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.