సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి తర్వాత బాలీవుడ్‌లోని డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. దాంతో అందరి దృష్టి బాలీవుడ్‌పై పడింది. ఈ నేపథ్యంలో నటి పాయల్‌ఘోష్ మరోసారి క్యాస్టింగ్ కౌచ్ వివాదానికి తెర తీశారు.
దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఓ సందర్భంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ‘ఒక ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓసారి మాట్లాడాలని.. అనురాగ్ ఇంటికి పిలిచారు. మరుసటి రోజు ఇంటికెళ్లేసరికి ఆయన మధ్యం సేవించి ఉన్నారు.
డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా అనిపించింది. నన్ను ఓ గదిలోకి తీసుకువెళ్లి.. నా దుస్తులు విప్పి బలాత్కరించబోయారు. నేను తిరస్కరించగా ‘ఇక్కడ ఇవన్నీ సాధారణమే నేను ఫోన్ చేస్తే రిచా చద్దా, హ్యుమా ఖురేషి, మహిగిల్ లాంటి నాయికలు వచ్చి నాతో గడుపుతారు’ అని చెప్పారు. ‘బాంబే వెల్వెట్’ చిత్రీకరణ సమయంలో ఇదంతా జరిగింది.
రణబీర్ సినిమాలో అవకాశం కోసం ఏ అమ్మాయి అయినా తనతో సన్నిహితంగా ఉండేందుకు సిద్ధంగా ఉంటారని ఆయన నాతో చెప్పారు. ‘మీటూ’ ఉద్యమం సమయంలోనే బయటకు వచ్చి అనురాగ్ కశ్యప్ గురించి చెప్పాలనుకున్నా.
అనురాగ్ వేధిస్తున్నాడని అప్పుడే ట్వీట్ చేశా. దర్శకుడిపై ఈ తరహా ఆరోపణలు చేేస్త అవకాశాలు రావని కొందరు చెప్పడంతో ట్వీట్ డిలీట్ చేశా. దాంతో అనురాగ్ నన్ను వాట్సా్‌పలో బ్లాక్ చేశాడు. మనసులో బాధ పోగొట్టుకోవడానికే ఇప్పుడు ఈ విషయాలను బయటపెట్టా’’ అని పాయల్ ఘోష్ తెలిపారు.