Home / MOVIES / హిందీలో టబు..తెలుగులో తమన్నా

హిందీలో టబు..తెలుగులో తమన్నా

యువహీరో నితిన్‌ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు.

హిందీ హిట్‌ ‘అంధాధున్‌’కి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో నితిన్‌ సరసన నభా నటేశ్‌ కథానాయికగా నటించనున్నారు. హిందీలో రాధికా ఆప్టే పోషించిన పాత్రను తెలుగులో నభా చేయనున్నారు. ఈ చిత్రంలో మరో కథానాయికకు చోటుంది.

కథలో కీలకమైన ఆ పాత్రను హిందీలో టబు పోషించారు. తెలుగులో టబు పాత్రకు తమన్నాను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని శనివారం నిర్మాతలు వెల్లడించారు. నవంబర్‌లో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి హరి కె. వేదాంత్‌ ఛాయాగ్రాహకుడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat