మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవే గౌడ 24 ఏండ్ల తర్వాత రాజ్యసభలోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో రాజ్యసభ్యుడిగా గెలుపొందిన ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు.
కర్ణాటకకు చెందిన నలుగురు సభ్యుల పదవీకాలం జూన్ 25తో ముగిసింది. దీంతో జూన్ 12న జరిగిన దైవార్షిక ఎన్నికల్లో ఆయన గెలుపొందారు.
మొత్తం 61 మంది సభ్యులు కొత్తగా ఎన్నికవగా, అందులో 45 మంది జూలై 22న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 87 ఏండ్ల దేవే గౌడ కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు సభ్యుడిగా ప్రమాణం చేయలేదు.
భారత ప్రధానిగా ఉన్న సమయంలో దేవే గౌడ మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన 1996 నుంచి 97 వరకు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలోని హసన్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.