తెలంగాణ రాష్ట్రంలో లక్ష పాజిటివ్ కేసులొచ్చినా చికిత్స, వైద్యం అందించే సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
కరో నా రహిత రాష్ట్రంగా కాకపోయినా వైరస్ చావులు లేని తెలంగాణగా మార్చేందుకు అందరూ సహకారాన్ని అందించాలని కోరారు. ఆరు నెలలుగా తా ను ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తుంటే..
‘ఏయ్ రాజేందర్, ఎన్ని వందల కోట్ల డబ్బుతో సూట్‌కేసులు వచ్చాయి’అంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడం బాధించిందన్నారు. సామాజిక మాధ్యమాలు, కొన్ని టీవీ చానళ్లు, కొన్ని పత్రికలు సంచలనాల కోసం దుష్ప్రచారాలు చేశాయన్నారు.
కరోనా చికిత్స కోసం ఎన్ని డబ్బులైనా వెచ్చించమని, ఏ మందులైనా కొనమని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. గురువా రం శాసన మండలిలో కోవిడ్–19 పై స్వల్ప వ్యవ ధి చర్చ సందర్భంగా రాష్ట్రంలో కరోనా వైరస్ ప్ర భావం, దాని నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను మంత్రి వివరించారు.
వైద్యశాఖ సిబ్బం ది సేవలు, చేస్తున్న శ్రమ, త్యాగానికి ఏం చేసినా తక్కువేనన్నారు. వారికి రెండు నెలలే ఇన్సెంటివ్ ఇచ్చామని, ఇంకా ఏమి చేయాలన్న దానిపై ప్రభు త్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
రాష్ట్రంలో 120 ఐసోలేషన్ సెంటర్లలో మందులు, భోజనం వంటివి అందిస్తున్నామని.. ఎమ్మెల్యేలు ఎవరైనా కోరితే వారి నియోజకవర్గాల్లో ఈ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని చెప్పారు.