జూన్ 10, 2019.. టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాలి ఆటకు వీడ్కోలు పలికిన రోజు.
సరిగ్గా 14 నెలల తర్వాత యువరాజ్ తన మనసు మార్చుకున్నట్లుగా అనిపిస్తుంది.తాజాగా రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని పంజాబ్ క్రికెట్‌లో డమస్టిక్ లీగ్‌లు ఆడాలని భావిస్తున్నాడు.
అలా మెల్లిగా మిగతా ఫార్మాట్లలోనూ బరిలో దిగనున్నట్లు తెలుస్తున్నది. అనుభవజ్ఞుడైన యువీ సేవలు రంజీ జట్టుకు అవసరం.
జట్టులో ఆటగాడిగా ఉంటూనే యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశకుడిగా వ్యవహరించాలని పంజాబ్ క్రికెట్ సంఘం ఇంతకముందు యూవీని కోరిన విషయం తెలిసిందే