టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. శ్రావణి ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ రెడ్డి స్పష్టం చేశారు.
సాయి అనే వ్యక్తి శ్రావణిని తన కళ్ల ముందే చంపాలని చూశాడని అతడు తెలిపాడు. పెళ్లి చేసుకోవాలని శ్రావణిపై సాయి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చాడని, పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాడనే భయంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని దేవరాజ్ రెడ్డి పేర్కొన్నాడు.
శ్రావణి ఫోన్ కాల్ రికార్డింగ్ మొత్తం బయటపెడతానని, పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు కూడా తాను సిద్ధమని తెలిపాడు.