గ్రేటర్ పరిధిలోని 185 చెరువుల పరిరక్షణ, అభివృద్ధి, సుందరీకరణ కోసం రెండేండ్ల కార్యప్రణాళికను సిద్ధం చేయాలని పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థల్లో ఖాళీ స్థలాలను గుర్తించి వాటిని గ్రంథాలయాలు, పార్కులు, బస్‌బేల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. బల్దియా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులపై బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వి విధ జోన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను జోనల్ కమిషనర్లు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వా రా మంత్రికి వివరించారు. పార్కు లు, బస్‌బేలు, టాయిలెట్లు, సెంట్ర ల్ మీడియన్‌లు, పాదచారుల వంతెనలు, స్కైవేలు, ఫుట్‌పాత్‌లు, వాల్ పె యింటింగ్, లేన్ మార్కింగ్, ఫ్లైఓవర్లపై పెయింటింగ్, చెరువుల పరిరక్షణ, అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, గ్రేవ్‌యార్డ్‌ల అభివృద్ధి, వెండింగ్ జోన్లు, కూరగాయల మార్కెట్లు తదితర అభివృద్ధి పనుల పురోగతిని తెలియజేశా రు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ పార్కులు, గ్రంథాలయాలు, బస్‌బేల అభివృద్ధికి అవసరమైన స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. చెరువుల పరిరక్షణ, అభివృద్ధిలో భాగంగా సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్(ఎస్‌టీపీ)ల నిర్మాణంతోపాటు అన్ని రకాల కనీస అవసరాలను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని సూచించారు. ఎఫ్‌టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్), బఫర్‌జోన్‌లను నిర్ధారించాలని స్పష్టంచేశారు.
అంతేకాకుండా సైక్లింగ్ ట్రాక్‌లు, వాకింగ్ ట్రాక్ లు, టాయిలెట్లు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. డిప్యూ టీ మేయర్ బాబా ఫసియుద్దీన్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి, అదనపు డైరెక్టర్ శ్రీనివాస్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజీత్ కంపాటి, జోనల్ కమిషనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.