తెలంగాణ రాష్ట్రంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,00,013 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 74.9గా ఉంది. 32,537 యాక్టివ్ కేసులకు గాను 25,293 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. బుధవారం మరో 2,817 మందికి పాజిటివ్ వచ్చింది.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,33,406 చేరింది. కొత్తగా 10 మంది మృతి చెందారు. వైరస్ మృతుల సంఖ్య 856కి చేరింది. తాజాగా 59,711 నమూనాలను సేకరించారు.
రాష్ట్రంలో 15,42,978 మందికి పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వివరించింది. జిల్లాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో 452, రంగారెడ్డిలో 216, కరీంనగర్‌లో 164, ఖమ్మం, నల్లగొండలలో 157, మేడ్చల్-మల్కాజిగిరిలో 129, సిద్దిపేటలో 120, సూర్యాపేటలో 116, వరంగల్ అర్బన్‌లో 114, నిజామాబాద్‌లో 97, భద్రాద్రి-కొత్తగూడెంలో 89, జగిత్యాలలో 88 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 20,396 పడకలు ఉండగా.. 2,774 మంది చికిత్స పొందుతున్నారు. 17,622 పడకలు ఖాళీగా ఉన్నాయి