ఐపీఎల్ మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా యూఏఈకి వెళ్లే విషయమై పునరాలోచనలో పడ్డట్టు సమాచారం.
వ్యక్తిగత కారణాలతో గత నెలలో జట్టుతో పాటు వెళ్లకుండా భారత్‌లోనే ఉన్నాడు. ప్రస్తుతం జట్టు సిబ్బంది 13 మంది కరోనా బారిన పడడం, రైనా స్వదేశానికి రావడంతో భజ్జీ కూడా ఈసారి లీగ్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నట్టు అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి.
‘లీగ్‌లో ఆడేదీ.. లేనిదీ సీఎ్‌సకేకు ఇంకా అధికారికంగా తెలపలేదు. కానీ హర్భజన్ రాకపోవచ్చని, అందుకు తగ్గట్టుగానే సిద్ధమవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ తమ ప్లేయర్స్‌కు సూచించింది’ అని ఈ స్పిన్నర్ సన్నిహితులు పేర్కొన్నారు.
చూస్తుంటే ఈసారి చెన్నై జట్టుకు పరిస్థితులు అంతగా అనుకూలిస్తున్నట్టు కనిపించడం లేదు.