కాంగ్రెస్ పార్టీలో నేతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కాంగ్రెస్‌లో ఇక తమకు భవిష్యత్ లేదని ఆలోచిస్తున్న కొంతమంది నేతలు పార్టీని వీడడం భారంగా భావిస్తున్నారు. అదే సమయంలో బీజేపీలో చేరడం తప్ప.. మరో ప్రత్యామ్నాయం కనిపించడంలేదు.
2024 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అసాధ్యమని పలువురు కాంగ్రెస్ నేతలు బేరేజు వేసుకుంటున్నారు. ఎన్నికల నాటికి ప్రధానిగా మోదీ మరింత బలపడతారని, అలాంటి సమయంలో కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలుపు అన్నది అత్యాసే అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు.
2024 నాటికి అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తి చేయడంద్వారా ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీకి తిరుగుండదని అనుకుంటున్నారు. ఎందుకంటే దేశంలో అత్యధిక ఎంపీలను అందించే రాష్ట్రం యూపీయే కనుక..
కేంద్రంలో అధికారమన్నది నల్లేరుపై నడకే అవుతుందని, మరోవైపు ఆర్థిక పరిస్థితులు కూడా ఎన్నికల నాటికి కుదురుకుంటాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం లేదని ఆలోచన చేస్తున్నారు.