బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటపడిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బుధవారం అరెస్ట్ చేసింది.
ఆ ఇద్దరిలో ఒకరైన అబ్దుల్ బాసిత్‌కు సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండాతో సంబంధం ఉందని ఎన్సీబీ వెల్లడించింది.
`సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండాతో బాసిత్‌కు సంబంధం ఉంది. రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ సూచనల మేరకు మిరాండా డ్రగ్స్ సేకరించినట్టు మాకు తెలిసింద`ని ఎన్సీబీ అధికారులు తెలిపారు.
గత ఏడాది మేలో మిరాండాను సుశాంత్ ఇంట్లో మేనేజర్‌గా రియా నియమించింది. సుశాంత్ ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలను మిరాండానే చూసుకునేవాడు. సుశాంత్ డబ్బును రియా కాజేయడంలో మిరాండాదే ప్రధాన పాత్ర అని సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపించారు.