తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కేంద్రం విడుదల చేసిన నాలుగో విడత అన్‌లాక్ మార్గదర్శకాల మేరకు ఈ నెల ఏడో తేదీ నుంచి మెట్రో రైళ్లను అనుమతిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిం చింది.
అయితే బార్లు, క్లబ్బులపై మాత్రం లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ మిగతా చోట్ల అన్ లాక్–4 మార్గదర్శకా లను కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర ప్రభు త్వం కూడా నాలుగో దశ అన్‌లాక్ మార్గదర్శ కాలను మంగళవారం విడుదల చేసింది.
కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించడంతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ కొన్ని కార్యకలా పాల విషయంలో ఆంక్షలు కొనసాగుతాయని రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది.
పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, థియేటర్లు వంటి ప్రాంతాల్లో మూసివేత కొనసాగుతుంది.
ఆన్‌లైన్, డిస్టెన్స్ విధానంలో బోధనకు అనుమతి కొనసాగించవచ్చు. అయితే సెప్టెంబర్ 21 నుంచి కంటైన్‌మెంట్ జోన్ల బయట కనీసం 50 శాతం మంది బోధన, బోధనేతర సిబ్బంది విధులకు హాజరుకావచ్చు.