టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. ఇకపై సౌత్‌నే టార్గెట్ చేయబోతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు బాలీవుడ్‌లో ఆమెకు సరైన సినిమా, అంటే తనకు పేరు తెచ్చేలా సినిమా రాలేదు. అక్కడ అవకాశాల కోసం.. అందరి చుట్టూ తిరగాలి. అందరితో పరిచయాలు పెంచుకోవాలి. కానీ సౌత్‌లో అలా కాదు. ఆమె కోసం నిర్మాతలు క్యూలో నిలబడుతున్నారు. అందుకే తనకి ఇంపార్టెన్స్ ఇవ్వని చోట ప్రయత్నాలు చేసే కంటే.. తను ఉంటే చాలు అనుకుంటున్న చోటే ఉండాలని ఆమె గట్టిగా ఫిక్స్ అయిందనే వార్తలు ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.
దీనికై ఆమె ఇకపై హైదరాబాద్‌లోనే ఉండాలని నిర్ణయం తీసుకుందట. అంతే కాదు హైదరాబాద్‌లో ఆమె ఓ లగ్జరీ ఫ్లాట్‌ని కూడా తీసుకోబోతున్నట్లుగా వార్తలు వినవస్తున్నాయి. నార్త్‌ని వదిలేసి సౌత్‌లోని తెలుగు, తమిళ భాషల చిత్రాలపై ఆమె ఫోకస్ పెట్టాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడామె ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ని అందుకున్న పూజా హెగ్డే.. రెమ్యూనరేషన్ విషయంలోనూ టాప్‌లోనే ఉంది. మరి ఆమె సౌత్ ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూద్దాం
Tags film nagar film news films kollywood movies Pooja pooja hegde slider Telugu Movies tollywood