భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం ప్రకటించారు. భారతదేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందన్నారు.
1991లో ఎంపీగా ఉన్న సమయం నుంచి తనకు ప్రణబ్ ముఖర్జీతో అనుబంధం ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
యావత్ తెలంగాణ సమాజం ప్రణబ్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.