కేంద్ర హోం మంత్రి అమిత్ షా దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం అనారోగ్య కారణాలతో ఈ నెల 18న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని దవాఖాన వర్గాలు శనివారం ప్రకటించాయి.
దీంతో ఈరోజు ఉదయం 7 గంటలకు ఆయన దవాఖాన నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఈరోజు ఉదయం దేశప్రజలకు ఓనం శుభాకాంక్షలు తెలుపుతూ అమిత్ షా ట్వీట్ చేశారు.
కాగా, ఈ నెల 2న అమిత్ షా కరోనా బారినపడిన విషయం తెలిసిందే. దీంతో గుర్గావ్లోని మేదాంత దవాఖానలో చేరారు.
చికిత్స అనంరతం కోలుకున్న ఆయన ఆగస్ట్ 14న ఇంటికి చేరారు. అయితే ఒళ్లు నొప్పులు, నీరసం తగ్గకపోవడంతో ఆగస్టు 18న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు.