నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన దళిత మహిళ తనపై 139 మంది అత్యాచారం చేసినట్టు కొద్ది రోజుల క్రితం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై నిర్భయ, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఇండస్ట్రీకి సంబంధించి యాంకర్ ప్రదీప్ పేరుతో పాటు.. హీరో కృష్ణుడు పేరు కూడా ఉండటం సంచలనంగా మారింది.
తనపై వచ్చిన ఆరోపణలని ఇప్పటికే ప్రదీప్ ఖండించగా, తాజాగా కృష్ణుడు ఈ ఇష్యూపై స్పందించాడు. ఈ వార్త విని నేను షాక్ అయ్యాను. ఎంతో మందితో కలిసి పని చేశాను. ఎప్పుడు నాపై ఆరోపణలు రాలేదు.
సిగరెట్, పబ్‌కి వెళ్లడం, మందు తాగడం ఇలాంటి అలవాట్లేమి లేవు. నా పై ఇలాంటి ఆరోపణలు రావడంతో ఇప్పటికీ షాక్‌లో ఉన్నా. ఈ విషయం మొదట నా భార్యకి చెప్పడంతో నాకు చాలా సపోర్ట్‌గా నిలిచింది.
ఇలాంటి ఆరోపణలు చేస్తే ఫ్యామిలీ అంతా ఎంత డిస్టర్బ్ అవుతుంది. ఒకరిపై ఆరోపణలు చేసే ముందు ఇంకేం ఆలోచించరా అంటూ కృష్ణుడు మండిపడ్డాడు.
నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఆమె చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం. దీని వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారు. నాకే ఆ అమ్మాయి నుండి ఫోన్ కాల్ రానే రాలేదు. లాక్డౌన్ టైంలో నల్గొండ నుండి కాల్ వచ్చింది.
అప్పుడు ఆ అమ్మాయి మీ ఫ్యాన్ అని మాట్లాడింది. అప్పుడు నేను తప్పుగా మాట్లాడలేదు. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా.. నాకు ఓ కూతురు ఉంది.. మా భార్యను నిర్మాతగా పెట్టి సినిమా కూడా మొదలుపెట్టా. నేను మహిళలకు ఎంత గౌరవం ఇస్తానో ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు.
ఇలాంటి ఘటనల్ని అందరూ ఖండించాలి. ఈ కేసులో లీగల్‌గా ముందుకు వెళతా,బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటా అని కృష్ణుడు హెచ్చరించాడు.